డబ్ల్యూటీవో చీఫ్గా ఆఫ్రీకా మహిళ
US backing paves way for Nigeria’s Okonjo-Iweala to lead WTO
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు కొత్త చీఫ్గా నైజీరియాకు చెందిన నోజి ఒకాంజో ఇవేలాకు డబ్ల్యూటీవో నాయకత్వాన్ని అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ సంస్థకు తొలి మహిళా చీఫ్గా.. తొలి ఆఫ్రికా నేతగా కూడా ఒకాంజో నాయకత్వం వహించనున్నారు. వాస్తవానికి డబ్ల్యూటీవో చీఫ్ పోస్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరో పేరును ఖరారు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య మంత్రి యో మయుంగ్ను డబ్ల్యూటీవో చీఫ్గా చేయాలని ట్రంప్ భావించారు.
కానీ బైడెన్ ప్రభుత్వం ట్రంప్ నిర్ణయాలన్నింటికీ తోసిపుచ్చుతున్న విషయం తెలిసిందే. అయితే నోజి ఒకాంజోకు బైడన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వగానే.. కొరియాకు చెందిన మంత్రి ఆ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి శాఖ తాజా ఘటనపై ఓ ప్రకటన చేసింది. ఆర్థికశాస్త్రం, అంతర్జాతీయ దౌత్యవిధానంలో నోజి ఒకాంజోకు అపారమైన జ్ఞానం ఉన్నట్లు అమెరికా తన ప్రకనటలో పేర్కొన్నది.