డ్వాక్రా సంఘాలకు రూ.70 లక్షలు

LOKESH
LOKESH, panchayatraj, it minister

కృష్ణా: ఏపి మంత్రి లోకేష్‌ శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 50 లక్షలతో సుందరీకరించిన చెరువును ప్రారంభించారు. గండేపల్లి లిఫ్ట్‌ నుంది పొన్నవరం చెరువుకు. వాటర్‌ సప్లిమెంటేషన్‌ స్కీంని ఆయన ప్రారంభించారు. పొన్నవరంలో పసుపు-కుంకుమలో భాగంగా..370 మంది మహిళలకు రూ.37 లక్షలు అందజేశారు. అలాగే డ్వాక్రా సంఘాలకు రూ.70 లక్షలు లోకేష్‌ అందజేశారు.