డ్ర‌గ్స్‌పై నిర్మాత సురేష్‌బాబు స్పంద‌న‌

suresh babu
suresh babu

 

తిరుమ‌లః తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉంటే తప్పకుండా సరిచేసుకుంటామని ప్రముఖ నిర్మాత
దగ్గుబాటి సురేష్ బాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయ‌న బాలాజీని దర్శించుకున్న‌
అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చేరకుండా, రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా
ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని సూచించాడు. మత్తుమందుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు
చేపట్టే కార్యక్రమాల్లో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటుందని, పెద్దలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.