డ్ర‌గ్స్‌కు అడిక్ట్ అయిన‌ రెజీనా కాసాంద్రా

Regina
Rgina Cassandra

రెజీనా ట్యాలెంట్ కి తగ్గ అవకాశాలు రాలేదు. మీడియం హీరోయిన్ గా నే మిగిలిపోయింది రెజీనా. ఇక ఈ మధ్య సినిమాలు కూడా తగ్గాయిపోయాయి. 2017 ఆమెకు ఈ ఏ మాత్రం కలసి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా రెజీనా ఒప్పుకుంది. ” నాకు 2017 గొప్ప సంవత్సరం కాదు, కానీ 2018 ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నా. ఈ ఏడాది నేను పనిచేసిన కొన్ని చిత్రాలు నటిగా నాలో పరిణతికి తోడ్పడ్డాయి. నా పాత్రలు చూసిన తర్వాత ప్రేక్షకుల్లో వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నా” అని చెప్పుకొచ్చింది. ఇక అ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగు లో చేస్తున్న ‘అ!’లో నేను డ్రగ్స్ కు బానిసైన అమ్మాయిగా కనిపిస్తా. ఇందులో నేను ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తుంటా. ఈ పాత్ర కోసం నా జుట్టును అండర్‌ కట్‌ చేసుకున్నా’ అని వెల్లడించింది రెజీనా.