డ్రగ్స్‌ వాడిన వారిని శిక్షించాలి: నారా లోకేశ్‌

Lokesh
Lokesh

హైదరాబాద్‌: సంచలనాత్మక డ్రగ్స్‌ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌వాడకాన్ని

ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని, డ్రగ్స్‌ వాడిన వారికి శిక్షపడాల్సిందేనని ఆయన అన్నారు. డ్రగ్స్‌ వలన జీవితాలు

నాశనం అవుతాయన్న ఆయన తల్లిదండ్రులుతమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో

ఉన్న తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతంహామీలు అమలు చేశామని, రానున్న రోజుల్లో మిగతా వాటిని కూడా

అమలు చేస్తామని అయన తెలిపారు.