డ్రగ్స్‌ రహిత హైదరాబాదే లక్ష్యం: పద్మారావు

TS Minister PadmaRao
TS Minister PadmaRao

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌గా
మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఈ నెల 30న
సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్‌ వాక్‌ కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ
కార్యక్రమానికి ‘మా అధ్యక్షుడు శివాజీరాజా మంత్రి పద్మారావును ఆహ్వానించారు. దీనికి
సానుకూలంగా స్పందించిన పద్మారావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకాన్ని
నామరూపాల్లేకుండా చేస్తామని, వాటి బారిన పడుతున్న యువతీ యువకులను కాపాడాతామని
ఆయన పేర్కొన్నారు.