డోక్లామ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు!

INDIAN ARMY
INDIAN ARMY

ఢిల్లీ: భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న డోక్లామ్‌ సరిహద్దు వివాదం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ విషయమై చైనా ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. వీటికి సమాధానం చెప్పేందుకు భారత్‌
కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని చైనా సరిహద్దుకు భారీగా సైనిక బలగాలను పంపినట్లు
పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఆర్మీ అధికారులు స్పందించుటకు నిరాకరించారు. సైన్యం అంతర్గత వ్యవ
హారాలను బయటకు వెల్లడించలేమని వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు చైనా మాత్రం వీటిని పట్టించుకోకుండా దూకుడుగా
వ్యవహరిస్తోంది. దీంతో డోక్లామ్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.