డొనాల్ట్‌ ట్రంప్‌కు మరో షాక్‌

ట్రంప్‌ హెలీప్యాడ్‌ కూల్చివేత

పామ్‌బీచ్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోయాక ఒక్కో షాక్‌ తగులుతున్నది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో ఉన్న ట్రంప్‌కు చెందిన విలాసవంతమైన మార్‌ఎలాగో రిసార్టు వద్ద నిర్మించిన హెలీప్యాడ్‌ను కూల్చివేయాలని స్థానిక అధికారులు నిర్ణయించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో 50 అడుగులు పొడవు, 8 అంగుళాల మందంతో కాంక్రీట్‌ హెలీప్యాడ్‌ను నిర్మించారు. హెలీప్యాడ్‌ కూల్చివేత కోసం నోటీసులు ఇచ్చినప్పటికీ రిసార్టు అధికారులు స్పందించలేదని.. అందువల్ల దానిని కూల్చివేయనున్నామని అధికారులు తెలిపారు.