డే కేర్‌ సెంటర్‌లలో నిర్లక్ష్యం

day care center
day care center

హైదరాబాద్‌ : నగరంలోని మధురనగర్‌లోని డేకేర్‌ సెంటర్‌లో దారణం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలుడు టార్పెంట్‌ ఆయిల్‌ తాగి తీవ్ర ఆనార్యోగానికి గురయ్యాడు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈసంఘటన జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డేకేర్‌కు వెళ్లిన బాలుడు టార్పెంట్‌ ఆయిల్‌ తాగి ఆస్వస్థకు గురయ్యాడు. బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైద్యానికయ్యే ఖర్యంతా తామే ఇస్తామన్నారు. తీరా వైద్యానికి రూ.47 లక్షలు ఖర్చువడంతో చేతులెత్తేసంది. దీంతో బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.