డెన్మార్క్ సూప‌ర్ సిరీస్ విజేత శ్రీకాంత్‌

sri
srikanth

భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం
సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 21-10, 21-5తో 37 ఏళ్ల లీ హ్యున్‌ (కొరియా)ను చిత్తు చిత్తుగా ఓడించాడు. ప్రకాశ్‌ పదుకొనె, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ టైటిల్‌ సాధించిన మూడో భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఒక్క ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెల్చుకున్న రెండో భారత ప్లేయర్‌ సైనా సరసన నిలిచాడు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించిన శ్రీకాంత్‌.. ఇప్పుడు డెన్మార్క్‌ ఓపెన్‌తో ‘సూపర్‌’ హీరోగా అవతరించాడు.బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఏడాదిలో 4 సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ఆడిన ఆరో ఆటగాడిగా కూడా 24 ఏళ్ల శ్రీకాంత్‌ ఘనత సాధించాడు.