నాట్స్‌ ఫుడ్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

Detroit
NATS

నాట్స్‌ ఫుడ్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

డెట్రాయిట్‌: పేదలకు సహాయం చేసి వారి కడుపు నింపాలనే సదుద్ధేశ్యంతోనే నాట్స్‌ కార్యక్రమాన్నిప్రారంభించినట్టు అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు సంఘం (నాట్స్‌) పేర్కొంది.. ఇక్కడ నిర్వహించిన ఫుడ్‌ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది.. అమెరికాలోని వివిధ నగరాల్లో ఈ ఫుడ్‌డ్రైవ్‌ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.. నోవైలోని శ్రీవెంకటేశ్వరాలయం, డైస్‌తోపాటు అనేక కార్యాలయాలు, వైద్యశాలలు, గృహసముదాయాల్లో ఫుడ్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్స్‌ను స్థానిక నాట్స్‌ చాప్టర్‌ సేకరించింది.ఇలా సేకరించిన వాటనిఇ ఓక్‌ పార్కులోని ఫర్‌గాటన్‌ హార్వెస్ట్‌కు అందజేసింది.. ఫుడ్‌ క్యాన్స్‌ సేకరణలో శ్రీ వెంకటేశ్వరాలయం నిర్వాహకులు ప్రసాద్‌ రవిపాటి, శివాజీ చిరుమామిళ, మహేశ్‌ చింతలపాటి, చలపతి కోడూరి, పద్మ సనం, నరేన్‌ సూర్యదేవర తదితరులను నాట్స్‌ మిచిగన్‌ అభినందించింది. నాట్స్‌ సభ్యులు బసవేంద్ర సూరపనేని, నాట్స్‌ ప్రతినిధులు కిశోర్‌ తమ్మినీడి, విష్ణు వీరపనేని, శ్రీని కొడాలి, ప్రసాద్‌ గొంది, డాక్టర్‌ శ్రీనివాస్‌ కొడాలి, శ్రీహరికా రెడ్డి, చంద్ర అన్నవరపు, దత్త సిరిగిరి, కిశోర్‌ కొడాలి, నచ్చనమెట్ల వేణుగోపాల్‌ సూరపరాజు, సుష్మ యార్లగడ్డ, శివ అడుసుమల్లి ప్రభృతులు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు శ్రమించారు.