డీసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగి ఆత్మహత్య!

విశాఖ: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంస్థ ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. అతను డీసీఐ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సంస్ధను ప్రైవేటుపరం చేయవద్దని వెంకటేశ్ వద్ద సూసైడ్‌నోట్ లభించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.