డీసీఐ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్‌

pawan kalyan
pawan kalyan

విశాఖ‌ప‌ట్ట‌ణంః జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కొద్దిసేపటి క్రితం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించేందుకు ఆయన విశాఖ వచ్చారు. ఉదయం 10.30 గంటలకు మధ్య పోర్టు ఏరియాలోని డీసీఐ వద్ద వెళ్లి… సీహార్స్‌ కూడలిలో ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో కూర్చుంటారు. డీసీఐ హెచ్‌.ఆర్‌ విభాగంలో అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ సోమవారం ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్‌ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.
డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలని డీసీఐ ఉద్యోగులు గతంలోనే పవన్‌కల్యాణ్‌ను కోరారు.సోమవారం వెంకటేశ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న పవన్‌ విస్మయానికి గురయ్యారు. సుమారు 1000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న డీసీఐను ప్రైవేటీకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో పవన్‌ సుమారు 2 గంటల పాటు కూర్చోనున్నారు. ఉద్యోగులు తమ గోడును పవన్‌కు వినిపించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.