డిసెంబర్ 21న ఖమ్మంలో టీటీడీపీ భారీ బహిరంగ సభ

TTDP held a huge public meeting at Khammam on December 21

Community-verified icon


డిసెంబర్ 21న ఖమ్మంలో టీటీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పటు చేయబోతుంది. దాదాపు ఐదు లక్షల మందితో ఈ సభ నిర్వహిచబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ ఫై ఫోకస్ చేయని చంద్రబాబు..మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో టీడీపీ అనేది లేనే లేదు. గతంలో ఉన్న నేతలంతా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ లో చేరి , టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. ఈ క్రమంలో రీసెంట్ గా తెలంగాణ టీటీడీపీ పగ్గాలు కాసాని జ్ఞానేశ్వర్‌ కు అప్పగించారు చంద్రబాబు.

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచుతుండగా.. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే.. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం దృష్టి సారించారు. గతంలో వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం తో ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో టీటీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో 5లక్షల మందితో భారీ బహరింగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీపీ నేతలు వెల్లడించారు.