డిసెంబర్ 17న పోలవరం గేట్లు బిగిస్తాం

అమరావతి: టిడిపి మంత్రి దేవినేని ఉమ ఈరోజు మీడియాతో మాట్లాడుతు డిసెంబర్ 17న పోలవరం గేట్లు బిగిస్తామని ఆయన వెల్లడించారు. పోలవరం రహదారిలో భూమి కుంగడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. కుంగిన ప్రదేశానికి, డ్యామ్ సైట్ చాలా దూరంలో ఉందన్నారు. ఆ ప్రాంతంలో డ్యామ్ నిర్మాణ సంస్థ రహదారి పునరుద్ధరణ పనులను చేపట్టిందని చెప్పారు. నెలాఖరుకు అన్ని ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.