డిసెంబర్‌ నుంచి బరిలోకి సైనా

6

డిసెంబర్‌ నుంచి బరిలోకి సైనా

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ టాప్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తిరిగి డిసెంబర్‌ నుంచి కోర్టులో అడుగుపెట్టనుంది. కాగా గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్‌ చేయించుకున్న సైనా తన పునరాగమనం మరింత బలంగా ఉంటుందని పేర్కొంది.అంతా సవ్యంగా జరిగితే డిసెంబర్‌లో దుబా§్‌ు వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఆడతాను.గత అయిదారు సంవత్సరాలలో నా ప్రద ర్శన కంటే ఆడబోయే మూడేళ్లు మరింత మెరుగా ఆడతాననే నమ్మకం ఉందని సైనా వెల్లడించింది. ఇటీవల తన కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయిం చుకున్న సైనా ముంబైలోని కోకిలా బెన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.

కాగా రియో ఒలింపిక్స్‌ లీగ్‌ దశ నుంచి నిష్క్రమించిన సైఆన మోకాలి గాయం తీవ్రంగా బాధించడంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.చికిత్స నిమిత్తం మొదట హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన సైనా ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ముంబైకి వెళ్లింది. కోకిలా బెన్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స పూర్తి కావడంతో ఆమె కోలుకుంటుంది.