డిమార్ట్‌ రూ.1800 కోట్ల ఐపిఒ

BSE
BSE

డిమార్ట్‌ రూ.1800 కోట్ల ఐపిఒ

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో ఇపుడు ఐపిఒ జోరు కొనసాగుతోంది. డిమార్ట్‌ ప్రమోటింగ్‌సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ వచ్చేనెల 8వతేదీ ఇష్యూకు రాబోతోంది. శుక్రవారం అప్‌లోడ్‌చేసిన డిఆర్‌హెచ్‌పిలో ఈ సమాచారం డిమార్ట్‌ సంస్థ వెల్లడించింది. బ్యాంకర్లనుంచి వస్తున్న సమాచారం ప్రకారం అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఐపిఒ ప్రైస్‌ధరలు 290-325మధ్య ఉంటుందని అంచనా.
ఈ ఐపిఒ ద్వారా సుమారు 1800 కోట్ల విలువైన షేర్లను విక్ర యిస్తోంది. ఈ ఏడాదిలో బిఎస్‌ఇ తర్వాత ఐపిఒకు వచ్ని రెండోసంస్థ డిమార్ట్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఐపిఒ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కొత్తశాఖల నిర్మాణం సరుకులతోపాటు కొద్దిగా రుణాలు తీర్చేం దుకు కూడా వినియోగిస్తారు. రిటైలింగ్‌ విలువల్లో ఉన్న ఈ సంస్త ఐపిఒ తర్వాత రూ.18వేల కోట్లకు ఉంటుందని అంచనా. కోటక్‌ మహీంద్ర క్యాపిటల్‌, యాక్సిస్‌ కేపిటల్‌, ఎడిల్విసిస్‌ ఫైనాన్షియల్స్‌తో సహా మరో ఆరుగురు మర్చంట్‌ బ్యాంకర్స్‌గా వ్యవహరి స్తున్నారు. మార్చి 8వ తేదీ నుంచి పదోతేదీతో ఇష్యూ ముగుస్తుంది. డిమార్ట్‌కు 45 నగరాల్లో 120 రిటైల్‌స్టోర్లు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ సంస్థకు మంచి పట్టుంది. 2016 మార్చి 31వ తేదీ నాటికి అవెన్యూ సూపర్‌మార్ట్‌ సంస్థ 8600 కోట్ల ఆదాయం, 320 కోట్ల నికరలాభాన్ని ఆర్జిం చింది. గడచిన నాలుగేళ్ల నుంచి రాబడులపరంగా 40శాతం, నికరలాభం పరంగా 52శాతం వృద్ధిని ఈ సంస్థ నమోదుచేస్తోంది. రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటీ, రిటర్న్‌ ఆఫ్‌ కేపిటల్‌ 24శాతంగా ఉంది. లాంగ్‌ టర్మ్‌ డెట్‌ ఈక్విటీ రేషియో 0.7శాతంగా ఉంది. గ్రేమార్కెట్‌లో అప్పుడు డిమార్ట్‌ ఐపిఒ ఎక్కడలేని క్రేజ్‌ వచ్చిపడుతోంది. అక్కడ 25-30శాతం వరకూ కనీస ప్రీమియం రావొచ్చని ఆశిస్తున్నారు.