డిబేట్‌ కోసం సిద్ధం కాలేదు: అధ్యక్ష పదవికి సిద్ధమయ్యా

debate
Hillery Vs Trump: US Presidential Debate

న్యూయార్క్‌: తాను డిబేట్‌ కోసం సిద్ధం కాలేదని అధ్యక్షపదవికోసం సిద్ధమయ్యానని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాను ఎలాంటి జాత్యాంహంకారం చూడలేదని వ్యాఖ్యానించారు. ఐసిస్‌పై పోరాటం చేయలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. ఐసిస్‌ ఎదుగుదలకు ఒక రకంగా ఒబామా, హిల్లరీలే కారణమని అన్నారు. హిల్లరీవి వట్టి మాటలేనని, 30 ఏళ్లుగా ఈ మాటలు వింటూనే ఉన్నామన్నారు. హిల్లరీ 30వేల ఇమెయిల్స్‌ డిలీట్‌ చేశారన్నారు.