డిప్యూటి సియం ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్న క‌విత‌

mehamood ali, kavita
mehamood ali, kavita

హైద‌రాబాద్ః అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి కవిత తెలుసుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రో సమస్యతో మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే.