డిజిటల్‌ సాంకేతికతల్లో ఐఒటి కీలకం

DRDO
DRDO

డిజిటల్‌ సాంకేతికతల్లో ఐఒటి కీలకం

డిఆర్‌డిఒ శాస్త్రవేత్త గౌతమ్‌ మహాపాత్ర

హైదరాబాద్‌: డిజిటల్‌ సాంకేతికతలు సవాళ్లతోపాటుగా సంస్థలకు అవకాశాలు సైతం పెంపొందిస్తాయని, ఆర్ధికవృద్ధి, సామాజిక ఆర్ధికాభివృద్ధి సమర్ధవంతమైన పాలనావిధానాల్లో ఐసిటి వృద్ధి పాత్రను తెలుసుకోవాలని డిఆర్‌డిఒ శాస్త్రవేత్త గౌతమ్‌ మహాపాత్ర వెల్లడించారు. ఐసిటిపై సంబంధిత న్రపముఖులు సంస్తలు దృష్టిసారించేందుకు త్పోడటంతోపాటు మొత్తం సమాజానికి య్రోజనం కలిగిస్తూనే దేశంలో డిజిటల్‌ విప్లవం తీసుకువస్తుందన్నారు. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఆర్‌సిఐ, నెట్‌యాప్‌ భాగస్వామ్యంతో డిఆర్‌డిఒ అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది.

ఐసిటి రంగంలోని పరిశోదకులు, శాస్త్రవేత్తలు, డెవలపర్లు అభ్యాసకులకు ఈ సదస్సు వేదికగా నిలిచింది. సదస్సులో ఐటిశాఖ ప్రిన్సిపల్‌కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సైయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బివిఆర్‌మోహన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధీనంలోని అనుబంధ సంస్థలు, రక్షణరంగ పరిశోధక విభాగం అధిపతులు, వర్సిటీ అధిపతులతోపాటు 150మందికిపైగాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. డిజిటల్‌యుగంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌, థర్డ్‌ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడటం, బిగ్‌డేటా టెక్నాలజీస్‌తో అనుసంధానమయిన ప్రపంచ సైబర్‌ సెక్యూరిటీ, ఉరక్షిత ప్రైవేటు, పబ్లిక్‌క్లౌడ్‌ విప్లవం వంటి వాటిపై విస్తృత చర్చలు జరిగాయి.నెట్‌యాప్‌ ఇండియా అధ్యక్షుడు అనిల్‌ వల్లూరి మాట్లాడుతూ డిఆర్‌డిఒలాంటి సంస్థలతో భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సదస్సు జరిగింది. ఈ సొసైటీని 1965 మార్చి 6వ తేదీ నగరంలోని డిఆర్‌డిఒ కాంపస్‌వద్ద ఏర్పాటుచేసారు.