డిజిటల్‌ రుణ పరపతిలో అగ్రగామి క్యాష్‌-ఇ

e-cash
e-cash

ముంబయి: యువ ఉద్యోగులకకు అవసరాలకోసం ఉన్న యువతకు డిజిటల్‌లెండింగ్‌కంపెనీ క్యాష్‌ఇ రూ.650 కోట్లమేర రుణాలను పంపిణీచేసిందని వ్యవస్థాపకులు వి.రమణకుమార్‌ వెల్లడించారు. 2016నుంచి కంపెనీ వేదంగా వృద్ధినిసాధిస్తోందని, భారీసైజు రుణాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్‌ లెండింగ్‌ ప్లాట్‌పామ్‌ వేదికగా 80శాతం వృద్దినిసాధించామని వెల్లడించారు. రూ.10వేలనుంచి రెండులక్షలవరకూ క్యాష్‌ఇ రుణాలుపంపిణీచేసిందని, మూడులక్షలకుపైబడిన రుణాలను రూ.1.80 లక్షలమందికి పంపిణీచేసామన్నారు. రోజువారిగా రూ.2కోట్లచొప్పున రుణాలు మంజూరుచేస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌పైనే రోజుకు 1000కిపైగా దరఖాస్తులు వస్తున్నాయని, యువ వేతన జీవిఉలు భారత్‌ దేశవ్యాప్తంగా సగటున రూ.35వేలనుంచి రూ.40వేలవరకూ రుణపరపతి కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ 2.2 మిలియన్‌ యాప్‌ డౌన్‌లోడ్లు ఉందని రోజుకు 200 వరకూ యాప్‌లు డౌన్‌లోడ్లు అవుతుంటే తమకు పెరుగుతున్న ప్రాధాన్యతను స్పష్టంచేస్తోందన్నారు. 2019నాటికి ఐదుమిలియన్ల డౌన్‌లోడ్స్‌ ఉంటాయని అంచనా. క్యాష్‌ ఇ, ఇఎంఐ ఎంకార్డు వంటివాటిని ఇటీవలే విడుదలచేసామని, ఇప్పటివరకూ ఉవేలకుపైగా ఇఎంఐ కార్డులు కస్టమర్లకు జారీచేసినట్లు క్యాష్‌ఇ వెల్లడించింది.