డిజిటల్‌ కెమెరాలలో ఫిల్మ్‌ అవసరం లేదా?

తెలుసుకోండి….

CAMERA

డిజిటల్‌ కెమెరాలలో ఫిల్మ్‌ అవసరం లేదా?

నేటి డిజిటల్‌ కెమెరాలలో ఫిల్మ్‌ ఉండే స్థానంలో ఛార్జ్‌ కపుల్డ్‌ డివైసెస్‌ ఉంటాయి. సిసిడిలో ఫొటో డయోడ్‌లు, షిఫ్ట్‌ గేట్‌లు, సాలిడ్‌స్టేట్‌ కెపాసిటర్లు అనే 3 విభాగాలు ఉంటాయి. కెమెరాలెన్స్‌ గుండా వచ్చిన కాంతికిరణం సిసిడిలోని ఫొటో డయోడ్‌ మీద ప్రసరించగానే విద్యుత్‌ ప్రవ హిస్తుంది. షిప్ట్‌ గేట్‌ స్విచ్‌ మాదిరిగా పనిచేస్తుంది. దీని ద్వారా ప్రవహించిన విద్యుత్‌ సిసిడిలోని సాలిడ్‌ స్టేట్‌ కెపాసిటర్‌లోకి వచ్చి, అందులో నిల్వ ఉంటుంది. సిసిడిలో ఉండే ఎనలోగ్‌ షిప్ట్‌ రిజిస్ట్‌ర్‌లు, కెపాసిటర్‌ల నుంచి వచ్చిన విద్యుత్‌ చార్జీలను సరైన పద్ధతిలో ఉంచు తాయి. సిసిడి యూనిట్‌లు ఒక సెల్‌ నుంచి, మరో సెల్‌కు ఓల్టేజీని ఏ మాత్రం నష్టం లేకుండా బదిలీ చేయ గలవ్ఞ. సిసిడి చిప్‌లో మెటల్‌ ఆక్సైడ్‌, సెమీ కండక్టర్‌ కెపాసిటర్‌లు (ఎంఒఎస్‌ కెపాసిటర్‌లు) అనేకం ఉం టాయి. ప్రతి కెపాసిటర్‌ ఒక్కొక్క పిక్సెల్‌ (పిక్చర్‌ ఎలిమెంట్‌ – బొమ్మ/ ఛాయా చిత్రం మూలాలు)గా పని చేస్తుంది.

సిసిడి చిప్‌ కెమెరాలను బ్యాంక్‌ ఇల్యూమినేటెడ్‌ కెమెరాలని కూడా అంటారు. డిజిటల్‌ టెక్నాలజీలో వచ్చిన తాజా అభివృద్ధిని తెలిపే ఉదాహరణ డిజిటల్‌ టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధితో ప్రాచీన నగ రాలకు తిరిగి జీవం పోయటం మీద నిపుణులు దృష్టి సారించారు. అమెరికా, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌లకు చెం దిన పురాతత్వ పరిశోధకులు, ఇంజనీర్లు కలసి 1700 ఏళ్ల నాటి రోమ్‌ నగరాన్ని కంప్యూటర్లలో పునః సృష్టిం చారు. 1998లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ 2007, మే నెలలో పూర్తయింది.

సైట్‌కు వెళ్లి ఆనాటి రోమ్‌ను మనం సందర్శించవచ్చు. కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ ద్వారా ఎంతో విస్తృతమైన, అరుదైన సమాచారం అంత టికీ ఒక రూపాన్ని అందించి క్రీ.శ. 320 నాటి రోమ్‌ను రూపొందించారు.