డబ్బులు పంచుతూ పట్టుబడ్డ శిల్పా అనుచరులు: సోమిరెడ్డి

Somireddy
SOMIREDDY CHANDRAMOHAN REDDY

 

 

నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అనుచరులు డబ్బులు పంచుతూ
దొరికారని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పుటేజీని టీడీపీ విడుదల
చేసింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ ఉన్మాది కన్నా హీనంగా మాట్లాడుతున్నారని,
చంద్రబాబును జగన్‌లాంటి వాళ్లు ఏమి చేయలేరని అన్నారు. జగన్‌కు ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా లేదనడం
హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజా చేసే వ్యాఖ్యలతో టీడీపీకి లాభమని, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది
కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.