డబ్బులు కాసే చెట్టు!

తెలుసుకో

TREE
Money Tree

డబ్బులు కాసే చెట్టు!

ఉదయాన్నే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుటే చెట్టు నిండా నోట్లు కనపడితే ఎలా అనిపిస్తుంది? ముందు కొద్దిగా కంగారు అనిపించినా ఆ తరువాత చాలా సంతోషం కలిగి ఆ నోట్లన్నీ తీసేసుకోవాలి అనిపిస్తుంది కదా! ఇదేదో చందమామ కథలోని మాయాజాలంలా అనిపించడం లేదూ? ఎక్కడైనా చెట్లకి డబ్బులు కాస్తాయా? అనే అనుమానం కలుగక మానదు. కాని అనుమానం అక్కరలేదు.

నిజంగా ఇది వాస్తవంగా జరిగిన సంఘటనే. సిడ్నీలోని ఒక పార్కులో తెల్లవారుజామున వాకింగ్‌ చేసే వాళ్లకి, జాగింగ్‌ చేసేవాళ్లకి ఒక వింత దృశ్యం కనపడింది. ఒక చెట్టు నిండా డాలర్‌ నోట్లు వేలాడుతూ కనపడినాయి. మొదట్లో చాలా మంది ఈ చెట్ల గురించీ, డాలర్ల గురించి పట్టించుకోలేదు. చూసినప్పటికీ మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన కొంత మంది జాగర్స్‌ దృష్టి వీటి మీద పడింది.

వాటిని పరిశీలించారు. ఎదురుగా అలా నోట్లు కనబడుతుంటే ఎవరైనా ఎలా ఊరుకోగలరు. అయితే వారు కూడా వాటిని పరిశీలించారే తప్ప తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది విన్నవారికి మనదేశంలో కూడా అలాంటి చెట్టు ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తుంది. మరి అలా జరగాలంటే ఆ దేవ్ఞడిని ప్రార్థించాలి. అయితే చెట్టుకి డాలర్‌ నోట్లు వేలాడడం, వాటిని అటువెళ్లే వారు పరిశీలించడం ఈ సంఘటలన్నీ వాస్తవాలే అయినా, చెట్టుకి మాత్రం డాలర్లు కాయలేదు. సిడ్నీలోని ఒక బ్యాంకు వారు చెట్టుకి డాలర్లను ఏర్పాటు చేసి వాటిని చూసిన వారి హావభావాలను తమ కెమెరాల్లో బంధించారు. అసలు సంగతి ఇదీ.