డబుల్ హాట్రిక్ సాధించింది ఐదుగురు టిఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్లోని ఐదుగురు నేతలు డబుల్ హాట్రిక్ సాధించారు. ఎన్నికలలో బ్రహ్మరథం పట్టి గెలిపించడం ఒకవైపు అయితే డబుల్ హాట్రిక్ సాధించిన వారు ఐదుగురు ఉన్నారు. వరుస విజయాలతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇందులో మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. సిద్దిపేట నుంచి హరీష్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివస్ారెడ్డి, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మపురి నుంచి కొప్పుల ఈవ్వర్లు ఉన్నారు. డబుల్ హాట్రిక్ సాధించిన వారందరూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.