ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశo

Shrutihassan1
Shrutihassan

ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశo

ఇప్పుడు ఉన్న సౌత్ హీరోయిన్లు చక చక సినిమాలను రిలీజ్ చేస్తుంటే శృతి మాత్రం స్లోగానే రిలీజ్ చేస్తోంది. తెలుగులో ఆమె చివరగా పవన్ కళ్యాణ్ – కాటమ రాయుడు లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ సౌత్ లో ఎక్కడా కనిపించలేదు. ఆ మధ్యనే బాలీవుడ్ లో బెహెన్ హోగీ తెరీ అనే సినిమాను చేసి పర్వాలేదనిపించుకుంది. అయితే ఆమె రీసెంట్ గా కన్నడలో ఓ సినిమాకి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ కామెంట్స్ రూమర్స్ అని  కన్నడలో సినిమా చేయడం లేదని కొట్టి పారేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా కన్నడలో సినిమా చేయనని శృతి చెప్పింది. దీనిపై ఆమె వేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశమైంది. ప్రస్తుతం ఆమె తన తండ్రి తెరకెక్కిస్తున్న శబాష్ నాయుడు అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా 2016 మొదలైంది. కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తమిళ్ – తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతోంది. అయితే ఈ తరం హీరోయిన్లు ఛాన్సులు వస్తే ఏ భాషలో అయినా నటించాలని అనుకుంటారు. కానీ శృతి మాత్రం కన్నడలో నటించనని గట్టిగా చెప్పడం చూస్తుంటే.. ఎందుకు అలా అనేసిందని సందేహం రాకమానదు.