ట్విట్టర్ తన తప్పిదాన్ని ఉపసంహరించుకుంది

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘బైసెక్సువల్’ హ్యాష్‌టాగ్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు, న్యూస్‌పై నిషేధం విధించింది. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న వాటిని బ్లాక్ చేసింది. దీంతోపాటు ‘Butt’, ‘boobs’ అనే పదాలను కూడా బ్లాక్ చేసింది. అయితే విచిత్రంగా ‘లెస్బియన్’, ‘గే’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పొటోలు మాత్రం ఇంకా ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. సెర్చ్ రిజల్ట్స్ నుంచి ఇవి మాయం కావడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ట్విట్టర్‌పై విమర్శల వర్షం కురిసింది. తాము మనుషులమేనని, తమను అడ్డుకోవడం అమానుషమంటూ ట్వీట్లు చేశారు. తాను బైసెక్సువల్మేనని, తమ ఉనికి నేరమెలా అవుతుందని కొందరు నిలదీశారు. ట్విట్టర్ ఉగ్రవాదులను, నాజీలను అనుమతిస్తుంది కానీ ప్రేమను మాత్రం అనుమతించదని మరికొందరు దుమ్మెత్తి పోశారు. ఇది తీవ్రమైన వివక్ష కిందకు వస్తుందని, తాము సైలెంట్‌గా ఉండే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ట్విట్టర్ వెంటనే స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, సెర్చ్ రిజల్ట్స్‌లో ఎర్రర్ కారణంగానే అలా జరిగిందని పేర్కొంది. త్వరలోనే పునరుద్ధరించనున్నట్టు తెలిపింది.