ట్విట్టర్‌లో మైలురాయి

PAWAN KALYAN
PAWAN KALYAN

ట్విట్టర్‌లో మైలురాయి

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అభిమానులంతా ఎంతో ఇష్టంగా పవన్‌ గురించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిచూపిస్తుంటారు.. ఇక ఈ క్రమంలోనే తన రాజకీయపరమైన ఆలోచనలు, విధానాలను పలుంచుకునేందుకు 2014లో పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా ఆయన ట్విట్టర్‌లో ఫాలోవర్స సంఖ్య 1మిలియన దాటింది.. తెలుగులో అతితక్కువ మంది హీరోలు మాత్రమే 1 మిలియన్‌ (10లక్షలు) ఫాలోవర్స్‌ దాటిన వారిలో ఉన్నారు.
మిగతా హీరోల్లా పవన్‌ తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో సినిమాలకు సంబంధించిన విషయాలను అస్సలు పంచుకోరు.. కేవలం తన పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడటం,, రాజకీయ ఆలోచనలు పంచుకోవటం, సమాజంలో జరిగే పలు సంఘటనలపై స్పందించటం మాత్రమే పవన్‌ ట్విట్టర్‌లో చేస్తూ వస్తున్నారు.. ఇక పవన్‌కు 1మిలియన ఫాలోవర్స్‌్‌ వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులతా ట్విట్టర్‌లో సందడి చేస్తూ పవన్‌ పాత ట్వీట్స్‌ గురించి చర్చించుకుంటూ వస్తున్నారు.