ట్విట్టర్‌కు పెరుగుతున్న విజ్ఞప్తులు

Twitter
న్యూఢిల్లీ: మోదీ సర్కారు నుంచి తమకు విజ్ఞప్తులు పెరుగుతున్నట్టు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య 355 ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కోరిందని, అలాగే, దేశ చట్టాల్ని ఉల్లంఘిస్తున్న 237 ఖాతాలను తొలగించాలని కోరినట్టు వివరించింది.ట్విట్టర్ 13వ ద్వైవార్షిక పారదర్శక నివేదిక ప్రకారం.. 11 శాతం కేసుల్లో ట్విట్టర్ భారత ప్రభుత్వానికి కోరిన సమాచారం అందించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రెండు ఖాతాలను, 23 ట్వీట్లను విత్‌హెల్డ్‌లో పెట్టింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 69ఎ ప్రకారం మంత్రిత్వ శాఖ జారీ చేసిన అదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది. భారత్‌లోని కోర్టు ఆదేశాల ప్రకారం 19 ఖాతాలను, 498 ట్వీట్లను విత్‌హెల్డ్‌లో పెట్టినట్టు వివరించింది.