ట్రైలర్‌ బాగుంది: చెర్రీ

Ramcharan, saptagiri
Ramcharan, saptagiri

ట్రైలర్‌ బాగుంది: చెర్రీ

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లుక్కాకుల దర్శకత్వంలో డాక్టర్‌ రవికిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి.. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.. ఈచిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోమవారం విడుదల చేశారు.. హీరో సప్తగిరి, దర్శకుడు చరణ్‌ , సంగీత దర్శకుడు విజ§్‌ు బుల్గానిన్‌, నిర్మాత డాక్టర్‌ రవి కిరణ్‌ పాల్గొన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, సప్తగిరి అంటే చాలా ఇష్టమని ఇద్దరం కలిసి ఒక సినిమా కూడ చేయటం జరిగిందన్నారు. ట్రైలర్‌ చాలా బాగుందని, హిందీ ట్రైలర్‌ కంటే తెలుగులో బాగా చేశారన్నారు. నిర్మాత డాక్టర్‌ రవికిరణ్‌ మాట్లాడుతూ, ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మాకు టైం కేటాయించి ట్రైలర్‌ లాంచ్‌ చేసిన రామ్‌చరణ్‌గారికి ధన్యవాదాలు అని తెలిపారు.. డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.. కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపారు.