ట్రేడింగ్ ఆసాంతం హెచ్చుతగ్గులే!

ట్రేడింగ్ ఆసాంతం హెచ్చుతగ్గులే!
ముంబై,: ట్రేడింగ్ ఆసాంతం స్వల్పస్థాయి హెచ్చుతగ్గులకులోనైన దేశీయస్టాక్ మార్కెట్లు చివరికి నామమాత్రపు లాభాలతోనే ముగిసాయి. ట్రేడిం గ్ ముగిసేసమయానికి సెన్సెక్స్ 14పాయింట్లు లాభపడి 28,240 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ ఏడుపాయింట్లుపెరిగి 8741 పాయింట్లవద్ద స్థిరపడింది. బడ్జెట్ నేపథ్యంలో గడచిన రెండురోజులు మార్కెట్లు లాభాలతో ర్యాలీ తీయ డంతో శుక్రవారం ట్రేడింగ్ మాత్రం పునరేకీకరణ బాటపట్టినట్లు అంచనాలు న్నాయి. అయితే ఈ ధోరణులకు విరుద్ధంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, చిన్న షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఎన్ఎస్ఇలో ఆటో, మెటల్; ఎఫ్ఎంసిజి రంగాలు 0.8 నుంచి రెండుశాతం మధ్య బలహీనపడితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సూచి మూడుశాతం పెరిగింది. సన్‌టివి ఆధ్వ ర్యంలో మీడియా షేర్లు పురోగమించడంతో మీడియాసూచి 2.3శాతం పెరిగింది. ఇక ఐటి, రియాల్టీసూచీలు సైతం ఒకటిశాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, టెక్ మహీంద్ర, సిప్లా, భెల్, ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ భారతీయస్టేట్‌బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు 5-1.5శాతంమధ్య ముందుకు దూకాయి. అయితే బోష్, జీ, ఐషర్‌మోటార్స్, టాటామోటార్స్,ఐసిఐసిఐ, పవర్‌గ్రిడ్, అరవిందో, అంబూజా, ఎసిసి కంపెనీలు 1-2.6శాతంమధ్య నష్టపోయాయి. బిఎస్ఇలో మిడ్‌క్యాప్స్ సూచి 0.6శాతం పెరిగితే స్మాల్క్యాప్సూచి 1.1శాతం ముందుకు దూకింది. మొత్తం ట్రేడింగ్ జరిగిన షేర్లలో 1624 కంపెనీలు లాభపడితే 1171 కంపెనీలు నష్టపోయాయి. చిన్నక్యాప్సూచీలో ఎంటిఎన్ఎల్ 20శాతం ర్యాలీతీసింది. కెఇఐ, యూనిటెక్, ఆర్షియా, మోనెట్, ఇస్పాట్, సీక్వెంట్, స్యూబెక్స్, స్టార్, టిసిఐ, గ్రాన్యూల్స్, రాజ్టివి,ఐఎఫ్బి, ఆర్బిట్ ఇండోరమా, ఏస్, కెసిపి, గుడ్రిక్, టిఎల్, ఆర్కిడ్ఫార్మా, ఎఫ్డిసి తదితర కంపెనీలు 7-17శాతం దూసుకుపోయాయి. ఎక్ఛేంజిల్లో బిఎస్ఇ షేర్లు శుక్రవారం భారీర్యాలీతీసాయి. ఇష్యూ ధర రూ.806 కంటే 1085 రూపాయలకు పెరి గింది. ప్రీమియంస్థాయిలో 35శాతం అధికధర లు పలికినట్లు తేలింది. మొత్తంగాచూస్తే ఒకదశ లో 1200 స్థాయికి కూడా చేరింది. 49శాతం పెరిగి రికార్డు నమోదుచేసింది. ఆటోరంగకంపెనీ లు రెండోరోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. జనవరి నెల విక్రయాల గణాంకాలే ఇందుకుకీలకం. టాటామోటార్స్ రెండుశాతం క్షీణించి 522గాముగిసింది. ఐటిరంగషేర్లు ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఒకటిశాతంచొప్పున క్షీణించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొంత మేర పెరిగాయి. ప్రభుత్వరంగంలోని ఆరుబ్యాంకులతోపాటు సిటీ యూని యన్బ్యాంకు, ఫెడరల్ బ్యాంకులు కూడా 52 వారాల గరిష్ఠస్థాయికి చేరాయి.