ట్రెండ్‌కు తగ్గ ఫ్యాషన్‌

new trend
new trend

ట్రెండ్‌కు తగ్గ ఫ్యాషన్‌

నలుగురూ మెచ్చుకునేలా ఉండాలంటే దుస్తులే కాదు హ్యాండ్‌బ్యాగులు ఎంచుకోవడం తప్పనిసరి. అవి ఇప్పుడు ఫ్యాషన్‌ యాక్ససరీస్‌లో ప్రత్యేకస్థానం పొందాయి. ఈతరం స్త్రీల అభిరుచి, ఆసక్తికి తగినట్టుగా పలురకాల డిజైన్లలో లభిస్తున్నాయి. అయితే వాటిని ఎంచుకునే ముందు కేవలం ఫ్యాషన్‌ మాత్రమే కాదు సౌకర్యం, రంగు, శరీరాకతికి తగినట్టుగా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. ్య విధులకు కాస్త పెద్దగా ఉండే లెదర్‌ నలుపు, గోధుమ రంగుల్లో ఎంచుకుంటే అవసరమైన వస్తువులన్నిటినీ వేసుకుని వెళ్ళవచ్చు. ్య కాస్త ఎత్తు ఎక్కువగా లావుగా కనిపించే వారు సన్నని రకాల్ని ప్రయత్నిస్తే బావ్ఞంటుంది.

సన్నగా పొడుగ్గా ఉన్నవారు గుండ్రని ఆకతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంటతీసుకుని వెళితే చూడముచ్చటగా ఉంటుంది. ్య పార్టీలకు ‘టోటెల్లా వంటివి చాలా బాగుంటాయి. ్య పెళ్లిళ్లు వంటి వాటికి ‘బ్రొకెడ్‌ క్లచ్‌ సరైన ఎంపికవుతుంది. ్య సాయంత్రాలైతే ‘క్లచ్‌ను మించిన సొగసు లేదు. క్లచ్‌లు కూడా ఇప్పుడు పలు డిజైన్లలో లభిస్తున్నాయి. ప్రముఖుల స్థాయి నుంచి సామాన్య మహిళల దాకా అందరి మనసూ దోచేస్తున్నాయి. దుస్తులకు తగిన రంగుల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.