ట్రిపుల్ త‌లాక్ పై సుప్రీం తీర్పును గౌర‌విస్తున్నాంః ఎంపీ అస‌దుద్దీన్

 mp asaduddin
mp asaduddin

హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై ఉన్న‌త న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీఅన్నారు. ఈ తీర్పు క్షేత్రస్థాయిలో అమలు
అంత సులభం కాదని, చట్టాలుచేయడం, తీర్పులు వెలువరించడం వల్ల ప్రయోజనం ఉండదని ట్రిపుల్‌
తలాక్‌ అనేది ఓ సామాజిక అంశమని, సంస్కరణల ద్వారానే మార్పు రావాలని ఆయ‌న అన్నారు. సామాజిక
సంస్కరణలు జరిగి సమాజంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును
పూర్తిగా చదివిన తర్వాత మళ్లీ దీనిపై స్పందించనున్నట్టు చెప్పారు. ప్రాథమిక హక్కులు ప్రకారం పర్సనల్‌
‘లా’పై సవాల్‌ చేయడం కుదరదని ఆయ‌న తెలిపారు.