ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ కనిపిస్తే వదిలేది లేదు?

              ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ కనిపిస్తే వదిలేది లేదు?

triple riding
triple riding

                                     ట్రిపుల్‌ రైడింగ్‌లో ముగ్గురికీ జరిమానాలు!
                                         హెల్మెట్‌ విషయంలో కాస్త రిలీఫ్‌…                                                                                                                    నిబంధనల అమలు కఠినతరం 
హైదరాబాద్‌: నగరంలో వాహన ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిిక్‌ పోలీసులు పలు నిబంధనలను అమలు చేస్తున్న సంగతి మనకు విదితమే. కాగా తాజాగా వారు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నగరంలో వాహన ప్రమాదాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమతువుతున్నారు. ఒకే బండిపై ముగ్గురు వెళ్ళినా ఏం కాదు, మమ్మల్ని అడిగే వారుండరు అని బైక్‌పై దూసుకుపోయే కుర్రకారుకు ఇక ఈ విషయంలో బ్రేకులు పడినట్లే. అంతేెకాకుండా మేం అమ్మాయిలం మమ్మల్ని ఎవరూ ఆపరులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎవరైనా కాని ట్రిపుల్‌ రైడింగ్‌లో పట్టుబడితే ఇక వెనక కూర్చున్న ఇద్దరికి కూడా జరిమానా విధించేందుకు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ట్రిపుల్‌ రైడింగ్‌కు జరిమానాగా వెయ్యి రూపాయలను విధించేవారు, కాని ఇక నుంచి మూడువేల రూపాయలను జరిమానాగా విధించనున్నారు. కాగా వెనక ఉన్న ఇద్దరికి చెరో వెయ్యి రూపాయలను జరిమానా విధిస్తారు. ముఖ్యంగా యువతలో మార్పుకోసం ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు? మోటారు వాహనాల చట్టం (188) కింద వెయ్యి రూపాయ‌లు ఫైన్‌ విధించనున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఐదు నెలల కాలంలో ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు నమోదు అయ్యాయి, 10లక్షల రూపాయల ఫైన్‌ విధించారు. కేసులు నమోదు చేసి ..వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందిస్తున్నారు. అంతేెకాకుండ ట్రిపుల్‌ రైడింగ్‌ విషయంలో యువతకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. అయినా రోజు
రోజుకు కేసులు పెరగడంతో మిగతా ఇద్దరికి ఫైన్‌ విధించే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ట్రాఫిక్‌ డిపార్ట్‌ మెంట్‌. నగరంలో వాహనప్రమాదాలును తగ్గించడానికి ట్రాఫిక్‌ పోలీసులు కొత్త అస్త్రాలను సంధిస్తున్నారు. అందులో భాగంగా దేశంలో మొదట పాయింట్ల విధానంను
ప్రవేశపెట్టడంతో వాహనదారులు ట్రాఫిక్‌రూల్స్‌ను పాటిస్తున్నారు. అదే విధంగా హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేసిన పోలీసులు మరో అడుగు ముందుకేసి, ట్రిపుల్‌ రైడింగ్‌ చేసే వాహనదారులకు భారీగానే జరిమానా విధించనున్నారు. పాయింట్ల విధానం వల్ల ఇప్పటికే వాహనదారుల వ్యవహారంలో చాలా మార్పులు వచ్చినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.
హెల్మెట్‌ విషయంలో కాస్త రిలీఫ్‌…
కాగా హెల్మెట్‌ ఖఛ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్‌ 129, 177లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్‌ ధరించకపోతే జరిమాన విధించే అవకాశం ఉంది. పదే పదే వాహనదారుడు హెల్మెట్‌ లేకుండా జరిమాన పడుతుంటె అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయవచ్చు. అలాగే అతని వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం ఉంది. ఇంకా మితి మీరి ప్రవర్తిస్తే మోటారు యాక్ట్‌ కింద అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచే అధికారం కూడా ఉంది. కాగా ఇలా కోర్టుకు వెళితే మూడునుంచి ఆరు నెలల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. చట్టం పదే పదే హెచ్చరిస్తున్నా ..కొందరు మాత్రం హెల్మెట్‌ పెట్టుకోవడానికి నిరాకరిస్తుంటారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో, ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలి? చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై క్లారిటీకి వచ్చింది పోలీసుశాఖ. అలాంటి వారికి కొంత వెసలుబాటు కల్పించేందుకు పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారికి మినహాయింపు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీని ప్రకారం సంబంధిత డాక్టర్‌ ద్వారా ఆ పత్రాలను సమర్పిస్తే ..పోలీసు శాఖ మినహాయింపును ఇస్తూ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. ఇప్పటికే ఇలాంటి సర్టిఫికేట్లు ఇచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. ఒక గవర్నమెంట్‌ డాక్టర్‌తో ధ్రువీకరణ పత్రం పొందాలని అప్పడే సర్టిఫికేట్‌ జారీ అవుతుందని చెబుతున్నారు. అలాగని చట్ట విరుద్ధంగా సర్టిఫికేట్‌ పొందితే కఠిన చర్యలుంటాయని వారు తెలిపారు.