ట్రిపుల్‌ తలాక్‌కు సవరణలు

Modi
Modi

ప్రకృతి పీడిత కేరళకు కేంద్రం బాసట
మన్‌కీబాత్‌లోప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ముస్లిం మహిళలపై అనాగరికంగా అమలుచేస్తున్న ట్రిపుల్‌ తలాక్‌బిల్లుకు సవరణలు తెస్తామని మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు ఆటవిక సంస్కృతికి నిదర్శనమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నెలవారీ నిర్వహించే మన్‌కీబాత్‌లో ప్రధాని దేశంలో పెరుగుతున్న అత్యాచారాలతోపాటు ముస్లిం మహిళలపై అనాగరికంగా జరుగుతున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును సవరించి మహిళలకు రక్షణ కల్పిస్తామని హామీఇచ్చారు. పార్లమెంటులో అత్యాచారాలపై ఆమోదించిన బిల్లు ఇకపై కీలక పాత్రపోషిస్తుంది, మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలకు కఠిన చర్యలు ఈ చట్టంద్వారా అమలవుతాయని ప్రధానిమోడీ పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్‌ తలాక్‌బిల్లుస్థానంలో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే మరొక బిల్లు ఖచ్చితంగా వస్తుందని, రాజ్యసభలో వర్షాకాలసమావేశాల్లో ఆమోదం పొందలేదని, ముస్లిం మహిళలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందనిమోడీ పేర్కొన్నారు. నిరుపేదలజీవితాల్లో వెలుగులు నింపాలని, వెనుకబడిన తరగతుల ప్రజలపై దోపిడీ వ్యవస్థను నిర్మూలిస్తామని వెల్లడించారు. మహిళలకు ఏరూపంలోనూ అన్యాయాన్ని సహించబోమని, ఇలాంటి ఘోర అకృత్యాలను దేశం క్షమించదని అన్నారు. క్రిమినల్‌ చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిందని, కనిష్టంగా పదేళ్లు జైలుశిక్ష ఉంటుందని, 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే ఇదే శిక్ష అమలవుతుందన్నారు. అలాగే తక్షణ ట్రిపుల్‌ తలాక్‌పై మాట్లాడుతూ సామాజిక పరివర్తన లేకుంటే ఆర్ధికవృద్ధి అసంపూర్తిగానే మిగిలిపోతుందని అన్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ట్రిపుల్‌తలాక్‌సవరణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉందని అన్నారు. ఈబిల్లుకు నిర్దేశించిన బిల్లు సవరణలు కేబినెట్‌ ఆమోదంపొందిందని కూడా తెలిపారు.ఈచట్టం దుర్వినియోగం కాకుండా ఎఫ్‌ఐఆర్‌ కేవలం బాధిత మహిళలు, ఆమె రక్తసంబంధీకులు మాత్రమే దాఖలుచేయాల్సి ఉంటుందని అన్నారు. లోక్‌సభ సమావేశాలు 118శాతం సానుకూలంగా నడిచాయని, రాజ్యసభ 74శాతం నడిచిందని అన్నారు. లోక్‌సభలో 21 బిల్లులు, రాజ్యసభలో 14 బిల్లులు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన సమావేశాల్లో సామాజిక పరివర్తనకు సంబంధించిన బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఎన్‌సిబిసికార్పొరేషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే బిల్లు ఆమోదం పొందిందన్నారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పునుసైతం అధిగమించి పాత ఎ స్‌సిఎస్టీ చట్టాన్ని అమలుచేసేందుకువీలుగా ఆర్డినెన్స్‌ను ఆమోదించామన్నారు. ఈ చట్టం ద్వారా ఎస్‌సిఎస్టీ కులాలకు మరింతప్రయోజనం కలుగుతుందని, నేరగాళ్లు అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడకుండా నిరోధించగలుగుతామన్నారు. పార్లమెంటుసమావేశాలు లాభదాయకంగా సాగేందుకు సహకరించిన ఎంపిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలకు తల్లడిల్లిన కేరళ రాష్ట్రానికి కేంద్రం బాసటగా నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు. సర్వంకోల్పోయిన బాధితకుటుంబాలకు ప్రభుత్వపరంగా ఉదారంగా సాయం అందాల్సిందేనని మోడీ పేర్కొన్నారు. కేరళ వరదలకు మృతిచెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆకుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. కేరళ పునరావాస చర్యల్లో కేంద్రం భద్రతా బలగాలు నిర్వహించిన సేవలు నిరుపమానమైనవని, కేరళ వరదలకు 265 మంది చనిపోగా రూ.20వేల కోట్లమేర నష్టం వాటిల్లిందని, కేంద్రం 543 కోట్లు విడుదలచేసినట్లు ఆయన తెలిపారు. ఎంఎన్‌రేగా కింద ఈనిధులు విడుదలయినట్లు తెలిపారు. దేశప్రజలకు రక్షాబంధన్‌, సంస్కృత్‌ దివస్‌ శుభాకాంక్షలతో ప్రారంభించిన మోడీ అనంతరం దివంగత ప్రధాని అటల్‌జీపై అనర్గళంగా ప్రసంగించారు. వాజ్‌పేయి హయాంలోనే మంత్రిమండలి మొత్తం స్థానాల్లో 15శాతానికి మించకుండా చూసారని, రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఇదే తీరు కొనసాగేలా చూసారన్నారు. పార్టీలకు అతీతంగా వర్షాకాల సమావేశాలు విజయవంతం అయ్యాయన్నారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల విజయాలను ఆయనప్రస్తుతించారు. 2018 ఆసియా క్రీడల విజేతలపట్ల దేశం గర్వపడుతోందన్నారు. భారత్‌ 29 పతాకాలు సాధించింది. ఏడు బంగారం, ఐదు వెండి, 17 రజత పతకాలు సాధించినట్లువివరించారు. గుర్‌గావ్‌కు చెందిన అంగవైకల్యం ఉన్న బాలిక సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలవడాన్ని ఆయన అభినందించారు. 97.8 శాతం మార్కులుసాధించి గర్వకారణంగా నిలిచిందన్నారు. పూర్తి వైకల్యంతో ఉన్న అనుష్కా పాండా ఆలిండియా టాపర్‌గా రావడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.