ట్రిపుల్ తలాక్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ విషయాన్ని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మహిళల కోసం కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు గత పార్లమెంటు సమావేశాల్లో కార్యరూపం దాల్చలేదు. దీంతో కేంద్రం ఆర్డినెన్స్ రూట్ తొక్కింది.