ట్రిపుల్‌ కెమేరాలతో తొలి స్మార్ట్‌ఫోన్‌

SMART PHONE
SMART PHONE

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు డ్యూయల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్లు మాత్రమే మనల్ని అలరించగా, ఇక నుంచి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కూడా మన ముందుకు రాబోతోంది. ప్రపంచపు తొలి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి హువాయి సిద్ధమవుతోంది. హువాయి పి20, హువావే పి20ప్రొ పేర్లలో రెండు స్మార్ట్‌ఫోన్లను హువావే భారత్‌లో లాంచ్‌ చేయబోతోంది. దీనికి సంబంధించి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇమేజ్‌ను టీజ్‌ కూడా చేసింది. కమింగ్‌ సూన్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌లైన్‌తో కంపెనీ దీన్ని పోస్ట్‌ చేసింది. దీనిలో పి20ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఉండబోతోంది. త్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఒకటి 40 ఎంపి, మరొకటి 20 ఎంపి, మూడోది 8ఎంపి సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్లో మోషన్‌ వీడియోను 720 పి రెజుల్యూషన్‌లో 960 ఎఫ్‌పిఎస్‌ వద్ద రికార్డు చేస్తోంది. హువావే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 27న పారిస్‌లో లాంచ్‌ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 8.0ఓరియోను, కంపెనీ సొంత కిరిన్‌ 970 ప్రాసెసర్‌ను, 128 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను, 24 ఎంపి ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉన్నాయి. హువావే పి20ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు4000 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉంది. డ్యూయల్‌ సిమ్‌ కార్డులను కూడా కలిగి ఉంది. పి20 స్మార్ట్‌ఫోన్‌ 5.8అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉండి, 20 ఎంపి, 12 ఎంపి సెటప్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వస్తోంది. దీని బ్యాటరీ 3400 ఎంఎహెచ్‌ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. హువావే పి20ప్రొ ధర రూ.72000ఉండొచ్చని అంచనా.
.