ట్రాఫిక్ జాంలతో విసిగిపోయిన ఒక వ్యక్తి

Trafficjam
Trafficjam

ట్రాఫిక్ జాంలతో విసిగిపోయిన ఒక వ్యక్తి తాను కూర్చున్న బస్సు నుంచి దిగిపోయి….రోడ్డుపై ట్రాఫిక్ సజావుగా సాగడానికి వేసే ట్రాఫిక్ లైన్లను పెయింట్ చేశాడు. ఈ సంఘటన చైనాలోని లియాన్యున్ గాంగ్ నగరంలో జరిగింది. అతగాడి పూర్తి వివరాలు తెలియరాలేదు. అతడి పేరు కాయ్ అని మాత్రం వెల్లడైంది. సీసీ ఫుటేజిలలో రోడ్డుపై ట్రాఫిక్ మళ్లించడానికి వీలుగా అతగాను యారో లైన్లను పెయింట్ చేయడం స్పష్టంగా కనిపించింది. తెల్ల పెయింట్ ఉన్న బకెట్ తీసుకుని అత్యంత రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ పెయింట్ చేస్తుండటం సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది. పోలీసులు అతగాడినిక 150డాలర్లు జరిమానా విధించారు. ట్రాఫిక్ ఇక్కట్లపై అతడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన తీరును మాత్రం జనం తెగ మెచ్చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారిపోయింది.