ట్రాక్ట‌ర్ బోల్తా ఘ‌ట‌న‌పై విచార‌ణ‌

tractor
tractor accident

న‌ల్గొండ: జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున 24 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ పీఏపల్లి మండలం పడ్మటితండా వద్ద ఏఎమ్మార్పీ కాల్వలో బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం పడ్మటితండా గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది మహిళలు జలసమాధి అయ్యారు. ఇక.. ఈ ఘటనపై పోలీసులు, మిషన్ భగీరథ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో బాధ్యులుగా మిషన్ భగీరథ గుత్తేదారు, ట్రాక్టర్ డ్రైవర్ బుచ్చిరెడ్డి, మేస్త్రి బుజ్జిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఇవాళ సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, మిషన్ భగీరథ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో మిషన్ భగీరథ పనులు సరిగా జరగకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వాళ్లు గుర్తించారు.