ట్రయల్‌ లేబర్‌

PREGNANT
PREGNANT

ట్రయల్‌ లేబర్‌

మొదటిసారి సిజేరియన్‌ ఆపరేషన్‌ అయిన వారిలో రెండవసారి నార్మల్‌గా కాన్పు అయ్యేటట్లు చేయడాన్ని ‘ట్రయల్‌ లేబర్‌ లేదా టయాక్‌ అని అంటారు. ఇది సెఫ్‌లో పెల్విక్‌ డిస్‌ ఆర్డర్‌ (సిపిడి) వ్ఞన్న వారిలో డాక్టర్ల పర్యవేక్షణలో ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమిస్తూ రోగి ఆరోగ్య కండీషన్‌ని గమనిస్తూ ట్రయల్‌ లేబర్‌కి సన్నద్దం చేస్తారు. దీనికి రోగి సహకారం చాలా అవసరం. దాదాపు 20-40% మందిలో ట్రయల్‌ లేబర్‌ వల్ల నార్మల్‌ కాన్పు కావడానికి, సిజేరియన్‌ చేయకుండా వ్ఞండడానికి చాలా హాస్పిటల్స్‌లో ప్రయత్నిస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి సిజేరియన్‌ చేస్తారనే అపోహ కూడా తోలగే అవకాశం ఉంది.

అనవసరంగా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయకుండా కాన్పు నార్మల్‌గా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డని సుఖ ప్రసవం ద్వారా అందించడమే ట్రయల్‌ లేబర్‌ ముఖ్యోద్దేశ్యం. ఇది మొదటి సారి సిజేరియన్‌ చేసినపుడు చేసిన కోతని (స్కార్‌) బట్టి ఉంటుంది. ఇది మూడు విధాలుగా ఉంటుంది
అడ్డంగా పొత్తికడుపులో కోత:
ఇది పోత్తి కడుపు క్రింది భాగంలో ఒక ప్రక్క నుంచి రెండవ ప్రక్కకు అడ్డంగా చేస్తారు.

ఇది సర్వసాధారణంగా ఆపరేషన్‌ చేసే పద్దతి. దీనివల్ల చాలా మందిలో ఎటువంటి రిస్క్‌ ప్రాబ్లమ్స్‌, యూట్రస్‌ రప్చర్‌ కావడం వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడవ్ఞ. ఇది ప్రీమెచ్యూరిటీ, కన్‌స్ట్రక్టివ్‌ రింగ్‌ వ్ఞన్న కేసుల్లో చేసే లో సెగ్మెంట్‌ ట్రాన్స్‌వర్స్‌్‌ ఆపరేషన్‌ చేసిన వారిలో చేసే పద్ధ మబమమమతి దీని వల్ల 1.7%మందిలో వర్టికల్‌, 0.2-1.5% మంది ఓ హరీజంటల్‌ (అడ్డం) గా చేసేవారిలో యూట్రస్‌ రప్చర్‌ వల్లే అవకాశం వ్ఞంది. అయితే దీనివల్ల సర్కిక్స్‌,వెజైన్‌,బ్లాడర్‌ (మూత్రకోశం) కి గాయాలు అయ్యే అవకాశం ఉంది.

– లో వర్టికల్‌ (స్కార్‌) కోత ద్వార ఆపరేషన్‌ చేయడం వల్ల (నిలువుగా చేయడం వల్ల) యూట్రస్‌ పల్చబడి యూట్రస్‌ రప్చర్‌ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎల్‌.ఎస్‌.సి.ఎస్‌ టెక్నిక్‌ అని అంటారు. టెక్నికల్‌ గా కోద్దిగా కష్టమైనప్పటికి రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశముంది. రక్తస్రావం కావడం, షాక్‌ వంటి కాంప్టికేషన్స్‌ ఏర్పడవ్ఞ. అయితే ఇది ప్లాసెరిటా ప్రీలియ,బిడ్డపోజిషన్‌ ట్రాన్స్‌వర్స్‌ లైలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఏర్పడుతాయి. అయితే దీని వల్ల పెరిటోనైటిస్‌ వచ్చే అవకాశం వ్ఞంది. మెటర్నిల్‌ మొర్టాలిటీ తక్కువగా ఉంటుంది. అలాగే అడాప్షన్స్‌ ఫ్రైబ్రాయిడ్‌ ట్యూమర్స్‌లో వ్ఞన్న సర్కిక్స్‌ కేన్సర్‌ వ్ఞన్న వెజైకో వెజైనల్‌ ఫిస్టులా వ్ఞన్న, ప్లాసెంటల్‌ ప్రాబ్లమ్స్‌ వ్ఞన్నపుడు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. లోయర్‌ సెగ్మేంట్‌ కోత వల్ల కాన్పు చేయడం కష్టమయ్యే అవకాశం ఉంది.

– క్లాసికల్‌ లేదా హై వర్టికల్‌ కోత: గర్భసంచి హై భాగంలో పై నుండి క్రిందికి నిలువు కోత ద్వారా ఆపరేషన్‌ చేయడం. ఇది 12-15 సెంమీ దాకా వ్ఞంటుంది. ఇది టెక్నికల్‌గా సులభంగా చేసే పద్దతి. గర్భసంచి గోడలు మందంగా ఉండడం వల్ల రక్త స్రావం ఎక్కువవడం, షాక్‌ పెరిట్‌ నైటిస్‌ వంటి కాంఫ్లికేషన్స్‌ ఏర్పడతాయి. ఇది బిడ్డ అడ్డంగా తిరిగినపుడు బ్రీచ్‌ ప్రెజేంటేషన్స్‌ వ్ఞన్నపుడు చెస్తారు. దీని వల్ల యూట్రస్‌ రప్చర్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

డబ్ల్యూహెచ్‌ఒ అంచనా ప్రకారం సిజేరియన్‌ ఆపరేషన్‌ కోత బట్టి, గర్భధారణలో,కాన్పు సమయంలో ఎదురయ్యే సమస్యల్ని బట్టి 10-15% కేసుల్లో ట్రయల్‌ లేబర్‌ చేయడం జరుగుతుంది. కండీషన్స్‌: 1. లో బర్త్‌ వెయిట్‌ ఉన్నపుడు 2.రిస్క్‌ఫ్యాక్టర్స్‌ తక్కువగా లేదా లేనపుడు 3.మెటర్నల్‌ బాడీ మాస్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నపుడు 4. సింగిల్‌ ప్రెగ్నెస్సీ 5. లో ట్రాక్స్‌వర్స్‌ యూట్రస్‌ ఇన్‌సిషన్‌ (కోత) ఇన్నపుడు 6. ఇతర గర్భసంచి ఆపరేషన్స్‌ జరగనపుడు, ముఖ్యంగా మయోమెక్టమీ ద్వారా ఫైబ్రాయిడ్‌ ట్యూమర్స్‌ తీయడం వంటివి లాప్రటామీ వంటి ఇతర ఆపరేషన్స్‌ జరగనపుడు చేస్తారు. – మెడికల్‌ కాంప్లికేషన్స్‌ అబ్‌క్ట్రికల్‌ కాంప్లికేషన్స్‌ లేనపుడు 28.2% మంది లో ట్రయల్‌ లేబర్‌ చేస్తారు. అన్ని కండీషన్స్‌ అనుకూలంగా ఉన్పప్పటికి 4.5% కేసుల్లో మాత్రమే, ట్రయల్‌ లేబర్‌ చేయడం కుదరదు. పద్ధతులు: ఇది రెండు పద్దతుల ద్వారా చేస్తారు.

1.విబిసిఎస్‌-ఇది 60-80% మందిలో సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసిన తర్వాత నార్మల్‌ డెలీవరీ కావడం. దీనివల్ల ఇన్ఫెక్షన్‌, రక్తస్రావం కావడం వంటి కాంప్లికేషన్స్‌్‌ తక్కువగా ఉంటాయి. రోగి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఈఆర్‌సిఎస్‌: డెలివరీ కానపుడు ట్రయల్‌ లేబర్‌ చేసిన ఫలితం లేనపుడు ఈఆర్‌సిఎస్‌ రెండవ సారి కూడా సిజేరియన్‌ చేయాల్సి వ్ఞంటుంది. కంట్రాక్షన్‌ సివియర్‌గా ఉన్నపుడు దీన్ని చేస్తారు.

సిజేరియన్‌ ఆపరేషన్‌ ఎప్పుడు చేస్తారు: సిపిడి,ఫీటల్‌ డిస్ట్రెస్‌ ప్లాసెంటా ప్రీలియా,ప్రీలిక్లాంప్సియా, ఎక్లాంప్సియా, మల్టీపుల్‌ ప్రెగ్నెస్సీ, ఫీటల్‌ అబ్‌నార్మాలీటీస్‌ (హైడ్రోసెఫలిస్‌) సర్వైకల్‌ కేన్సర్‌ అక్టివ్‌ హెర్పిస్‌ ఇన్ఫెక్షన్‌,ఇంతకు ముందు సిజేరియన్‌ అయిన వారిలో,పేషంట్‌ చాయిస్‌ను బట్టి ఉంటుంది. సర్వైకల్‌ డిస్టోసి యా,కాంట్రాక్టెడ్‌ పెల్విస్‌ వ్ఞన్నపుడు ట్రయల్‌ లేబర్‌ వీలుకాదు. అంతే కాకుండా యుక్త వయస్సులో గర్భధారణ జరిగినపుడు, పెల్విక్‌ లోపాలు, ఫ్రీవిక్లాప్సియా పోస్ట్‌ మెచ్యురిటీ, అబ్‌నార్మల్‌ ఫీటల్‌ ప్రజెంటేషన్స్‌ కిడ్ని గుండె జబ్బులున్నపుడు డయాబెటీస్‌ వ్ఞన్నవారిలో కూడా ట్రయల్‌ లేబర్‌ వీలుకాదు.

డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి