ట్రంప్ వాణిజ్య విధానంతో లాటిన్ అమెరికాలో కలవరం

లాటిన్ అమెరికాతో వాణిజ్యాన్ని తక్కువ చేసి చూపేదిగా ట్రంప్ వాణిజ్య విధానం ఉన్నదని లాటిన్ అమెరికా, కరేబియన్ ఎకనమిక్ కమిషన్ (ఇసిఎల్ఎసి)కి చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి సెబాస్టియన్ హెర్రెరాస్ అన్నారు. లాటిన్ అమెరికాతో వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఇసిఎల్ఎసి ప్రకారం మొత్తం అమెరికా ఎగుమతులలో లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల వాటా 24.9 శాతం ఉండగా, ఆ ప్రాంతం నుంచి దిగుమతి మొత్తలు 19.2 శాతం ఉన్నాయని హెర్రెరాస్ పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య విధానం యొక్క బహుళ పాక్షికత, స్వేచ్ఛా వాణిజ్యం, పట్ల నిబద్ధత, చారిత్రక సూత్రాలు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయని ఆయన తెలిపారు. వాణిజ్య లోటును తగ్గించడం, ద్వైపాక్షికత, కొన్ని సందర్భాలలో మరింత రక్షణ వాద వైఖరి పై కేంద్రీకృతమై ఉన్న ఒక కొత్త దృష్టిని అమెరికా వాణిజ్యం కలిగి ఉన్నదన్నారు.