ట్రంప్ పై అభిశంస‌న తీర్మానం తిర‌స్క‌ర‌ణ!

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: మత దురాభిమానం, జాతి వివక్షతో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన అలిగ్రీన్‌ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిని అమెరికా దిగువసభ తిరస్కరించింది. తీర్మానం సభలో చర్చకు రాకుండా అడ్డుకుంది. అయితే, అధికార రిపబ్లికన్‌లు సహా, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన అత్యధికమంది ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. చర్చ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై ఓటింగ్‌ నిర్వహించగా 364 మంది తీర్మానాన్ని వ్యతిరేకించారు. 58 మంది మద్దతిచ్చారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి ఇది సరైన సమయం కాదని సొంత పార్టీ నేతలే అలిగ్రీన్‌ను వారించారు.