ట్రంప్‌ ఉత్తర్వులపై టెక్కీసంస్థల సవాల్‌

b4
Twitter

ట్రంప్‌ ఉత్తర్వులపై టెక్కీసంస్థల సవాల్‌

న్యూయార్క్‌, : హెచ్‌వన్‌బి వీసా ఆంక్షలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై అమెరికా కొత్త అధ్యక్షుడు సంతకం చేయడాన్ని సవాల్‌చేసేందుకు అక్కడి ఐటి సంస్థల దిగ్గజాలే ముందుకువస్తున్నాయి. ట్విట్టర్‌చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జాక్‌ డోర్సీ మరో వెయ్యిమందికిపైగా ఆయన సహచరులు మొత్తంగా 1.5 మిలియన్‌ డాలర్లనిధిని ఒక హక్కుల సంస్థకు విరాళంగా ఇచ్చారు. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత్కాలక నిషేధంపై పోరాడేందుకు వారంతా సంఘటితం అయ్యారు. శరణార్ధులపై తాత్కాలిక నిషేధం, ఏడు ముస్లిం దేశాల వలసలపై వేటు వంటివాటిని ట్రంప్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికన్‌ పౌరహక్కుల యూనియన్‌ (అక్లూ)కు ఈ భారీ విరాళం అందచేసారు. అంతేకాకుండా అప్పటికే అక్లూ సంస్థ 24 మిలి యన్‌ డాలర్లు ఆన్‌లైన్‌లోనే విరాళాలు సేకరించింది. ప్రాథమి కంగా ట్విట్టర్‌ సిబ్బంది 925మంది 5.30 లక్షల డాలర్లను విరా ళం ఇచ్చారు. తదతనంతరం సిఇఒ డోర్సీ ఎగ్జిక్టూయివ్‌ ఛైర్మన్‌ ఒబిడ్‌ కోర్డేస్తానిలు ఈ మొత్తాని 1.59 మిలియన్‌ డాలర్లకు తీసు కెళ్లినట్లు టెక్‌క్రంచ్‌ సంస్థ వెల్లడించింది. రానున్ననెలల్లో కొన్ని న్యాయ పరమైన సవాళ్లను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుందని, చట్టపరంగా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ బహిరంగప్రకటనలు కూడా కొంత వ్యతిరేకత ఉందని ట్విట్టర్‌ ఉద్యోగులు చెపుతున్నారు. పౌరహక్కుల సంఘాలుప్రతిఘటించి పోరా డుతున్నంతవరకూ తమలాంటి ఉద్యోగులు స్వేఛ్ఛగా ఉండగలుగుతామని ట్విట్టర్‌ జనరల్‌ కౌన్సిల్‌ విజయగద్దె ఒక మెమోలో రాసారు. శరణార్ధులు, వలసపౌరులు అమెరికాకు తెచ్చిన సంపదతో తాము లబ్దిపొందామని ట్విట్టర్‌ సిఇఒ వెల్లడించారు. మైక్రోసాప్ట్‌ ట్రంప్‌ పాలనయంత్రాంగానికి విజ్ఞప్తిచేస్తూ పర్యాటక ఆంక్షలు ఎత్తివేయాలని వలసలపై ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులు, వీసా, సరిహద్దు భద్రతవంటి అంశాలపై సమీక్షించాలని సూచించింది. గతవారం లోనే ట్రంప్‌ ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌ యెమెన్‌ వంటి దేశాల నుంచి ఉగ్రవాదం వలసవస్తోందని వీటిపై ఆంక్షలు ప్రకటించారు. సిలికాన్‌ వ్యాలీకిచెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు భారతీయ సంతతికి చెందిన సిఇఒ గూగుల్‌ సుందర్‌ పిచ్చ§్‌ు, మైక్రోసాప్ట్‌ సత్యనాదెళ్లవంటివారు ట్రంప్‌ వసలపై వేటును ఖండించారు. ఈ విధానం తమ సంస్థల సిబ్బందిపై ప్రభావంచూపిస్తుందని, అమెరికా కు ప్రతిభావంతుల రాకను అడ్డుకుంటుందని పేర్కొన్నారు.మైక్రోసాప్ట్‌, గూగుల్‌,యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌టెస్లా, ఫేస్‌బుక్‌, ఉబేర్‌ ఇతర టాప్‌ అమెరి కన్‌ కంపెనీలు ట్రంప్‌ వసల ఉత్తర్వులను ధనుమాడాయి. టెకీ దిగ్గజం గూగుల్‌ ఇందుకోసం ఒక సంక్షోభనిధిని కేటాయించి 4 మిలియన్‌ డాలర్లను సమీ కరించింది. నాలుగు పౌరహక్కుల సంఘాలు అక్లూ, శరణార్ధులకోసం పనిచేస్తు న్న ఐక్యరాజ్యసమితి హైకమిషనర్‌ కార్యాలయం వంటి వాటి కృషికి ఈ నిధులు అందిస్తుంది.ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌బెర్గ్‌ మొట్టమొదటిసారిగా ఈ శరణార్ధు లపై నిషేధం, వలసలపై ఆంక్షలు వంటి వాటిపై తన నిరసన గళం విప్పారు.