ట్రంప్‌ను కొరియాకు ఆహ్వానించిన కిమ్‌

TRUMP, KIM
TRUMP, KIM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ తమ దేశానికి ఆహ్వానించారు. భేటీ సమయంలోనే కిమ్‌, ట్రంప్‌ను ఆహ్వానించగా అందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. సింగపూర్‌ వేదికగా జరిగిన భేటీలో పూర్తిస్థాయి అణు నిరాయుధీకరణకు కిమ్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే భేటీ జరుగుతున్న సమయంలో తమ దేశాలకు రావాలంటూ ట్రంప్‌, కిమ్‌ ఒకరినొకరు ఆహ్వానించుకున్నారని కేసీఎన్‌ఏ పేర్కొంది. ఈ ఆహ్వానాలకు ఇద్దరు అంగీకరించినట్లు తెలిపింది. భేటీ సఫలమైతే కిమ్‌ను అమెరికా ఆహ్వానిస్తానని గతంలో ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే.