ట్యాంక్‌బండ్ వ‌ద్ద మౌన‌దీక్ష వ‌హించిన మోత్కుప‌ల్లి

motkupalli narasimhulu
motkupalli narasimhulu

హైద‌రాబాద్ః మాజీమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఇదిలా ఉండగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.