టైటాన్‌ నుంచి జక్స్ట్‌స్మార్ట్‌వాచ్‌

TITAN
ముంబై : దేశంలో అగ్రగామి వాచ్‌ల కంపెనీ టైటాన్‌ కొత్తగా జక్ట్స్‌ పేరిట స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. ఎండి భాస్కర్‌భట్‌, సిఇఒ రవికాంత్‌లతో పాటు జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ సోలర్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ వాచ్‌లను విడుదలచేసారు. హెచ్‌పి ఇంక్‌ సౌజ న్యంతో ప్రవేశపెట్టిన ఈ వాచ్‌ల ధరలు 15,995 రూపాయలు, 19,995 రూపాయలుగా ఉన్నాయి. టైటానియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, గులాబి పసిడిరంగుల్లో టైటాన్‌ షోరూం లలో లభిస్తున్నాయి. కేవలం సొంత స్టోర్లకే కాకుండా హీలియోస్‌లో కూడా ఈ స్మార్ట్‌ వాచ్‌లను ప్రవేశపెట్టింది. అలాగే ముందుగా ప్రీబుకింగ్‌కోసం టైటాన్‌ డాట్‌కోటాట్‌ఇన్‌, /జక్ట్స్‌, మింత్రా ప్లాట్‌ఫామ్‌లపై బుక్‌ చేసుకోవచ్చు. గురువారం నుంచి బుకిం గ్స్‌ ప్రారంభించినట్లు భాస్కర్‌భట్‌ వెల్ల డించారు. ఈవాచ్‌లపై అన్ని ఇన్‌కమింగ్‌ కాల్‌ నోటి ఫికేషన్స్‌తోపాటు ఈమెయిల్‌, సామాజిక వెబ్‌సైట్ల నోటిఫికేషన్లు అంటే వాట్సాప్‌, ట్విట్టర్‌, లింక్డ్‌ఇన్‌ వంటి అలర్ట్‌లు కూడా చూసుకోవచ్చు. టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఆటోమేటిక్‌ టైమక్ష్‌జోన్‌ సర్దుబాటు, నెలవారీ ఫిట్‌నెస్‌గోల్స్‌, కాలెండర్‌ అపాయింట్‌ మెంట్‌ రిమైండర్లు మొత్తం ఈ స్మార్ట్‌వాచ్‌లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా టైటాన్‌ కొత్తగా జక్ట్స్‌యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.