టేలర్‌పై పాక్ కెప్టెన్ ఆగ్రహం

అబుదాబి: న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టైలర్‌పై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని తీరేమీ బాలేదని మండిపడ్డాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ బౌలర్ హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ టేలర్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్ తొలి ఓవర్ ముగియగానే అతడు చకింగ్ చేస్తున్నాడంటూ టేలర్ ఫిర్యాదు చేసినట్లు వీడియోల్లో కన్పించింది. దీంతో సర్ఫరాజ్ సీరియస్ అయ్యాడు. వెంటనే అంపైర్ట దగ్గరకు వెళ్లి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.