టెన్త్‌ చదివితేనే ఇక సర్పంచ్‌!

Villages
Villages

టెన్త్‌ చదివితేనే ఇక సర్పంచ్‌!

హైదరాబాద్‌: పంచా యతీరాజ్‌ చట్టంలో పలు కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కసర త్తులు తీవ్రతరం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యా అర్హత 10వ తరగతి ఉండేలా చట్టంలో మార్పులు తెస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల విషయంలో కేంద్ర చట్టాలే ప్రధానమైనప్పటికీ, ఆయా రాష్ట్రాలు ఆ చట్టాలను అమలు చేసేటప్పుడు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించుకునే అధికారాలు కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో సర్పం చులుగా, ఎంపిటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసే వారికి కనీస విద్యా ర్హతను నిర్ధారించే అధికారం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. హర్యా ణా రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కనీస విద్యార్హత 10వ తరగతిగా ఉంది. కొత్త పంచాయతీ రాజ్‌చట్టం ఎలా ఉండాలి? ఎలాంటి విధులు స్థానిక సంస్థలకు అప్పగించాలి? ఎలాంటి బాధ్యతలను వారు నిర్వర్తించాలి? వాటికి నిధులు ఎలా సమకూర్చాలి? ప్రజలకు మరింత జవా బుదారీగా,మరింత క్రియాశీలకంగా తమ కార్యకలాపాలు నిర్వ హిం చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.

గ్రామపంచాయతీలు కేవలం నామమా త్రంగా ఉండటానికి వీలు లేదు. ప్రస్తుతం గ్రామ పంచాయితీలు విధులు, బాధ్యతలు లేకుండా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అవన్నీ ప్రజలకు నూటికి నూరుశాతం చేరాలంటే స్థానిక సంస్థలు బాగా పనిచేయాలి. ఏ గ్రామానికి ఆగ్రామసర్పంచ్‌, గ్రామ పంచాయతీ చిత్తశుద్దితో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలకు చేరుతాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.