టెక్సాస్‌కు ట్రంప్ 50 వేల కోట్ల ఆర్ధిక స‌హాయం

Trump
Trump

వాషింగ్ట‌న్ః హ‌రికేన్‌ హార్వే సృష్టించిన బీభత్సం టెక్సాస్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ నష్టపరిహారాన్ని అందించాలనుకుంటున్నారు. సహాయ చర్యల కోసం మొదటి దఫాగా సుమారు 50వేల కోట్లు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే అంత మొత్తం ఆర్థిక సాయం అందించాలంటే ముందుగా కాంగ్రెస్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. టెక్సాస్‌. లూసియానా రాష్ట్రాల వరద బాధితులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ అకౌంట్‌ను రిలీజ్‌ చేసేందుకు కావాల్సిన చర్యలపై ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి టెక్సాస్‌ వెళ్లిన ట్రంప్‌ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హరికేన్‌ హార్వేల వల్ల సుమారు 47 మంది చనిపోయారు. 50వేల మంది నిరాశ్రయులయ్యారు.