టెంపర్‌ రీమేక్‌ సంగతులు

RANVEER SINGH
RANVEER SINGH

ఎన్టీఆర్‌, పూరిజగన్నాధ్‌ కలయికలో వచ్చిన టెంపర్‌ సినిమాఎన్టీఆర్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన చిత్రం..అయితే ఈచిత్రం హిందీ రీమేక్‌లో రణవీర్‌ సింగ్‌ , సారా ఆలీఖాన్‌హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.. సింబా టైటిల్‌తో బాలీవుడ్‌లోకి రీమేక్‌ అవుతున్న ఈచిత్రం డిసెంబర్‌ 3న థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుందని తాజాగాయూనిట్‌ అధికారికంగా తెలిపింది.. డిసెంబర్‌ 28న ఈచిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.. రోహిత్‌శెట్టి తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.కరణ్‌జోహార్‌, రోహిత్‌ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం ఇటీవలే గోవాలో చివరి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.. ఈచిత్రంలోరణ్వీర్‌ సింగ్‌ సరికొత్త లుక్‌లో కన్పించనున్నాడు.